షుగర్‌ను పెంచేది ఆహారమా.. తినే టైమా?
- కార్బ్స్‌కు సమయం కీలకం
- ఉదయం జీర్ణక్రియ వేగంగా ఉంటుంది
- రాత్రి షుగర్ స్పైక్స్ ఎక్కువ
- ప్రీడయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది
- త్వరగా డిన్నర్ చేయడం మంచిది
- ప్రోటీన్, ఫైబర్‌తో కలిపి తినాలి
ఉదయం తిన్న అన్నం శక్తినిస్తే.. రాత్రి తిన్న అదే అన్నం సమస్యలు తెచ్చిపెడుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. శరీరంలో పనిచేసే జీవ గడియారం కారణంగా కార్బోహైడ్రేట్ల ప్రభావం సమయాన్ని బట్టి మారుతుంది. అందుకే ఉదయం 8 గంటలకు తిన్న ఆహారాన్ని శరీరం సులభంగా జీర్ణం చేసుకోగలిగితే, రాత్రి 8 గంటలకు అదే ఆహారం రక్తంలో చక్కెర స్థాయులను పెంచే అవకాశం ఉంటుంది. షుగర్‌కు దగ్గరగా వచ్చిన కోట్లాది మందికి ఇది చాలా కీలక విషయం.
జీవగడియారం ప్రభావం
మన శరీరంలో సర్కేడియన్ రిథమ్ అనే జీవ గడియారం పనిచేస్తుంది. ఇది నిద్ర, మేల్కొనే సమయంతో పాటు జీవక్రియలను కూడా నియంత్రిస్తుంది. ఉదయం శరీరం చురుగ్గా ఉండటంతో ఇన్సులిన్ సమర్థంగా పనిచేస్తుంది. ఫలితంగా కార్బోహైడ్రేట్ల నుంచి విడుదలయ్యే గ్లూకోజ్‌ను కణాలు సులభంగా వినియోగించుకుంటాయి. అందుకే ఉదయం తిన్న ఆహారం శక్తిగా మారే అవకాశం ఎక్కువ.
రాత్రి ఎందుకు ప్రమాదం?
రాత్రి సమయానికి జీవక్రియలు సహజంగానే మందగిస్తాయి. ఇన్సులిన్ ప్రభావం కూడా తగ్గుతుంది. ఈ సమయంలో ఎక్కువ కార్బోహైడ్రేట్లు తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు వేగంగా పెరగొచ్చు. శరీర కదలికలు తక్కువగా ఉండటం వల్ల అదనపు గ్లూకోజ్ కొవ్వుగా నిల్వ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీర్ఘకాలంలో ఇది ప్రీడయాబెటిస్, టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.
పరిశోధనలు చెప్పిందే
పలు అధ్యయనాల ప్రకారం ఉదయం తీసుకున్న కార్బోహైడ్రేట్లకు శరీరం మెరుగ్గా స్పందిస్తుంది. అదే ఆహారాన్ని రాత్రి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయులు ఎక్కువగా పెరుగుతున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా ప్రీడయాబెటిస్ ఉన్నవారు భోజన సమయాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
పాటించాల్సిన చిట్కాలు
కార్బోహైడ్రేట్లు పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. అయితే వాటిని ఉదయం నుంచి మధ్యాహ్నం మధ్య తీసుకోవడం మంచిది. రాత్రి భోజనం 7 నుంచి 8 గంటలలోపు ముగించాలి. అలాగే కార్బోహైడ్రేట్లతో పాటు ప్రొటీన్, ఫైబర్ ఉండే ఆహారం తీసుకుంటే రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా నియంత్రించవచ్చు. క్రమబద్ధమైన భోజన సమయాలు కూడా ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి.